0, 15 September, 2021

ఎన్నికల కేబినెట్: మంత్రివర్గంలోకి సజ్జల రామకృష్ణా రెడ్డి?: వైఎస్ జగన్ వ్యూహం ఇదే

 గత ఏడాది పాక్షికంగా..

గత ఏడాది పాక్షికంగా..

2019 జూన్ 8వ తేదీన వైఎస్ జగన్ మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 25 మంది అప్పట్లో ప్రమాణ స్వీకారం చేశారు. గత ఏడాది జులైలో వైఎస్ జగన్ పాక్షికంగా మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణ- రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. వారి స్థానాన్ని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాస శాసన సభ్యుడు సీదిరి అప్పలరాజుకు కేబినెట్‌లో తీసుకున్నారు వైఎస్ జగన్. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో ధర్మాన కృష్ణదాస్‌కు ఉప ముఖ్యమంత్రి హోదాను కేటాయించారు.

 హామీ మేరకే..

హామీ మేరకే..

రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తామని వైఎస్ జగన్ అప్పట్లోనే ప్రకటించారు. మంత్రుల పనితీరు ఆధారంగా పునర్వ్యవస్థీకరణ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు- దానికి అనుగుణంగా కేబినెట్‌ను రీషఫల్ చేసే దిశగా వైఎస్ జగన్ త్వరలోనే కసరత్తు చేస్తారని తెలుస్తోంది. విజయదశమి పండగ తరువాత పూర్తిస్థాయిలో తన దృష్టిని కేంద్రీకరిస్తారని, మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన సమీక్షలు, సమావేశాలను నిర్వహిస్తారని చెబుతున్నారు. మంత్రుల పనితీరుపై ఇప్పటికే ఓ నివేదిక సైతం సిద్ధమైందని అంటున్నారు.

 ఎన్నికల కేబినెట్‌లో..

ఎన్నికల కేబినెట్‌లో..

వైఎస్ జగన్ రెండో దఫా చేపట్టబోయే విస్తరణను అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ఇదే కేబినెట్‌తో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలను ఎదుర్కొంటుంది. దీనితో తొలి రెండున్నరేళ్ల కాలంలో చోటు చేసుకున్న పొరపాట్లు గానీ, తప్పులు గానీ పునరావృతం కాకుండా.. కేబినెట్ కూర్పు ఉంటుందనడంలో సందేహాలు అనవసరం. అటు పరిపాలన, ఇటు రాజకీయంగా ఎదురయ్యే దాడులను సమర్థవంతంగా తిప్పి కొట్టడంలో సమర్థులైన వారికి మాత్రమే రెండో విడత మంత్రివర్గంలో చోటు కల్పించాలనేది వైఎస్ జగన్ అభిప్రాయంగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితులతోనూ పంచుకున్నట్లు సమాచారం.

సజ్జలకు చోటు..

సజ్జలకు చోటు..

ఈ క్రమంలో సజ్జల రామకృష్ణా రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం వైఎస్సార్సీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారుగా ఉంటున్నారు. కేబినెట్ ర్యాంక్‌తో కొనసాగుతున్నారు. అలాగే- వైసీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని వైఎస్ జగన్ ఓ నిర్ణయానికి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల కేబినెట్ కావడం వల్ల- సజ్జల రామకృష్ణా రెడ్డికి కీలక పోర్ట్‌ఫోలియోను అప్పగిస్తారని తెలుస్తోంది. రాజకీయ పరమైన దాడులను తిప్పి కొట్టడానికి.. ఎదురుదాడి చేయడానికీ సజ్జల సేవలను వినియోగించుకుంటారని సమాచారం.

ఆ విమర్శలకూ చెక్..

ఆ విమర్శలకూ చెక్..

ప్రస్తుతం సలహాదారు హోదాలో ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి- కొన్ని రాజకీయ పరమైన విమర్శలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. రాజ్యాంగేతర శక్తిగా ఆయనను అభివర్ణిస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు. అటు తెలుగుదేశం పార్టీతో పాటు వైసీపీకే చెందిన లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు సైతం సజ్జలను టార్గెట్‌గా చేసుకుని పలుమార్లు విమర్శలను సంధించిన విషయం తెలిసిందే. కేబినెట్‌లోకి సజ్జలను తీసుకోవడం ద్వారా అలాంటి విమర్శలకు చెక్ పెట్టినట్టవుతుందనీ అంటున్నారు.

వైఎస్ కుటుంబానికి ఆత్మీయుడు..

వైఎస్ కుటుంబానికి ఆత్మీయుడు..

వైఎస్ కుటుంబానికి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆత్మీయుడు. అత్యంత దగ్గరివాడు. ఆయన స్వస్థలం కూడా పులివెందులే. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ ఆయన ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందారు. అప్పట్లో పెద్దగా రాజకీయాల్లో లేరు. వైఎస్సార్ హఠాన్మరణం అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సజ్జల- వైఎస్ కుటుంబానికి అండగా నిలిచారు. వైఎస్ జగన్ నెలకొల్పిన వైఎస్సార్సీపీలో చేరారు. అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన సేవలను వైఎస్ జగన్ వినియోగించుకుంటున్నారు. ప్రజా వ్యవహారాల సలహాదారుగా నియమించారు.

 సమీకరణాలు సహకరిస్తాయా?

సమీకరణాలు సహకరిస్తాయా?

సజ్జల రామకృష్ణారెడ్డిని కేబినెట్‌లోకి తీసుకోవాల్సి వస్తే- రాజకీయ, స్థానిక, సామాజిక వర్గ సమీకరణాలు మారిపోయే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి సొంత జిల్లాకే చెందిన నాయకుడు కావడం వల్ల మలిదశ కేబినెట్ విస్తరణలో ఆ జిల్లాకు చెందిన మరొకరికి చోటు దక్కకపోవచ్చు. అదే సమయంలో- వైఎస్ జగన్ సామాజిక వర్గానికి చెందిన వాడే కావడం మరో మైనస్ పాయింట్‌గా మారుతుందనే వాదనలు కూడా లేకపోలేదు. ఆయన సేవలు పార్టీకీ, ప్రభుత్వానికి అవసరమైనందు వల్ల వైఎస్ జగన్ తన విచక్షణాధికారాలతో సజ్జలకు బెర్త్ కల్పిస్తారని చెబుతున్నారు.

Vijayawada లో Sonu Sood కి ఊహించని క్రేజ్.. Amaravati రైతులకి మాటిచ్చిన సోనూ || Oneindia Telugu

కడప జిల్లాల నుంచి

కడప జిల్లాల నుంచి

వైఎస్ జగన్‌ను మినహాయిస్తే- ప్రస్తుతం కడప జిల్లాకు మంత్రివర్గంలో దక్కింది ఒక కేబినెట్ మాత్రమే. కడప శాసన సభ్యుడు అమ్జాద్ భాషా మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు. రెండోదశ విస్తరణ సందర్భంగా రాయచోటి శాసన సభ్యుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మంత్రివర్గ పదవిని ఆశిస్తున్నారని అంటున్నారు. వారిద్దరూ మొదటి నుంచీ పార్టిలో ఉంటోన్న వారే. సజ్జలను కేబినెట్‌లోకి తీసుకుంటే- రెడ్డి సామాజిక వర్గం కోటా ఆయనతో భర్తీ అవుతుంది. మరొకరికి ఛాన్స్ ఉండకపోవచ్చు.

Adblock test (Why?)