0, 12 February, 2019

హ‌స్తిన వీధుల్లో హోదా నినాదం: రెండు కిలో మీట‌ర్లు బాబు ర్యాలీ : అనుస‌రిస్తున్న నేత‌లు..

చంద్ర‌బాబు బృందం ర్యాలీ ఆరంభం..

చంద్ర‌బాబు బృందం ర్యాలీ ఆరంభం..

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నేతృత్వంలో ఏపికి ప్ర‌త్యేక హోదా..విభ‌జ‌న అంశాల‌ను అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఏపి భ‌వ‌న్ నుండి నిర‌స‌న ర్యాలీ ప్రారంభ‌మైంది. ఏపి భ‌వ‌న్ నుండి జంత‌ర్ మంత‌ర్ వ‌ర‌కు ఈ ర్యాలీ కొన‌సాగ నుంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు..చ‌ల‌సాని శ్రీనివాస్‌, హీరో శివాజీ, ఉద్యోగ సంఘాల నేత‌లు, మంత్రులు, టిడిపి ఎమ్మెల్యేలు, వివిధ సంఘాల ప్ర‌తినిధులు ఈ ర్యాలీలో కొన‌సాగుతున్నారు. ఏపి భ‌వ‌న్ నుండి దాదాపు రెండు కిలో మీట‌ర్ల‌కు పైగా దూరం కాలి న‌డ‌క‌న ఈ ర్యాలీ కొన‌సాగుతోంది. ర్యాలీ ఏపికి హోదా ఇవ్వాల‌ని నినాదాలు చేస్తున్నారు. మోదీకి వ్య‌తిరేకంగా స్లోగ‌న్లు ఇస్తున్నారు.

రాష్ట్రప‌తి వ‌ద్ద‌కు 11 మంది బృందం ..

రాష్ట్రప‌తి వ‌ద్ద‌కు 11 మంది బృందం ..

ఏపీ భవన్‌ నుంచి ప్రారంభ‌మైన ఈ ర్యాలీ జంతర్‌ మంతర్‌ వరకు కొన‌సాగ‌నుంది. ఆ తర్వాత ఏపికి ప్రత్యేక హోదా.. విభజన చట్టంలోని 18 అంశాల అమలును కోరుతూ ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం రాష్ట్ర పతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనుంది. రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ ప్రజా సం ఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి రాష్ట్రపతిని కలవాలని మొదట నిర్ణయించారు. రాష్ట్రపతి భవన్‌ కేవలం 11 మందికే అవకాశమివ్వడంతో ఆ మేరకే నేతలను తీసుకొని వెళ్లనున్నారు. ఉదయం పది గంటలకు ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ నుంచి ప్రదర్శనగా బయలుదేరి రాష్ట్రపతి భవన్‌కు చేరుకోనున్నారు.

రాష్ట్రపతి భవన్‌

రాష్ట్రపతి భవన్‌

రాష్ట్రపతిని కలిసే బృందంలో ముఖ్య మంత్రితో పాటు కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు- కళా వెంకట్రా వు, నక్కా ఆనంద్‌బాబు, అమరావతి ఉద్యోగుల ఐకాస ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆంధ్ర మేధావుల ఫోరం ఛైర్మ న్‌ చలసాని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఐకాస అధ్యక్షుడు యు.మురళీకృష్ణ, ఏపీయూడబ్ల్యూజే అధ్య క్షుడు ఐ.వి.సుబ్బారావు, ఏపీ ఏన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ సినీ పరిశ్రమ ప్రతినిధి శివాజీ ఈ బృందంలో ఉంటారు.

Let's block ads! (Why?)