0, 12 February, 2019

జగన్‌కు ఓటేయండి: ఏపీ ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేసే ఛాన్స్, వైసీపీకి లాభమా, నష్టమా?

వైసీపీకి ఓటేయమని విజ్ఞప్తి

వైసీపీకి ఓటేయమని విజ్ఞప్తి

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో జగన్‌కు ఓటు వేయమని కేసీఆర్ ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేసే ఆవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన నేరుగా ప్రచారం చేయకపోయినప్పటికీ.. వైసీపీకి ఓటు వేయమని ఓ ప్రకటన విడుదల చేసే అవకాశముందని అంటున్నారు. సమాచారం మేరకు తెరాస.. వైసీపీకి అనుకూలంగా ఉండాలని భావిస్తోందని అంటున్నారు. ఎన్నికల తర్వాత కూడా ఫెడరల్ ఫ్రంట్‌గా ఏర్పడాలని భావిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం ఇప్పటికే కేటీఆర్.. జగన్‌తో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో ఏపీలో వైసీపీకి అనుకూలంగా ఉండాలని భావిస్తున్నారట.

'జడ్జిలను మార్చి జగన్ కేసు మొదటికి తెచ్చారు, జైలుకు ఎందుకు పంపించలేదు'

కేసీఆర్ పిలుపు వైసీపీకి లాభిస్తుందా?

కేసీఆర్ పిలుపు వైసీపీకి లాభిస్తుందా?

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి ఉన్న క్రేజ్ కాంగ్రెస్ పార్టీ కంటే వైసీపీకి లాభిస్తుందని, అలాగే వైసీపీ ఇటీవల పుంజుకుందని, ఆయన సెక్యులర్ లీడర్ అని.. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగన్‌కు అనుకూలంగా ఉంటుందని తెరాస కూడా భావిస్తోందట. కేసీఆర్‌ను అభిమానించే, ఇక్కడితో (తెలంగాణ) సంబంధాలు ఉన్న వారు ఏపీలో ఉన్నారని, ఈ నేపథ్యంలో కేసీఆర్ పిలుపు ఫలితం వైసీపీకి లాభిస్తుందని కూడా తెరాస వర్గాలు భావిస్తున్నాయట.

 సీఎంగా తెలంగాణలోని సీమాంధ్రుల మన్ననలు అందుకున్న కేసీఆర్

సీఎంగా తెలంగాణలోని సీమాంధ్రుల మన్ననలు అందుకున్న కేసీఆర్

పైగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని సీమాంధ్రుల మన్ననలు అందుకున్నారు. ఇది కూడా కేసీఆర్‌కు మంచి పేరు తీసుకు వచ్చిందని, కాబట్టి ఆయన ఇచ్చే సూచన ఏపీ ప్రజలు కూడా సానుకూలంగా తీసుకుంటారని చెబుతున్నారు. వైసీపీకి ఓటు వేయమని ఏపీ ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేస్తే అది జగన్‌కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో ఏపీ వ్యతిరేకిగా కేసీఆర్‌ను చంద్రబాబు ప్రొజెక్ట్ చేయడంలో విజయవంతమైతే అది జగన్‌ను దెబ్బతీస్తుందనే వాదనలు కూడా లేకపోలేదు.

Let's block ads! (Why?)