0, 12 February, 2019

స్విగ్గీలో ఆర్డరిచ్చాడు... నూడుల్స్‌లో ఏం కనిపించిందో తెలిస్తే కడుపులో తిప్పేస్తుంది

National

oi-Kannaiah

|

ఈ బిజీలైఫ్‌లో కనీసం వంటచేసుకునే వీలు కూడా దొరకడం లేదు. అందుకే చాలామంది ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డరిస్తున్నారు. ఆర్డరు ఇవ్వడంవరకు బాగానే ఉంది. కానీ పార్శిల్‌లో వచ్చే ఆహారం పరిశుభ్రంగా ఉందా లేదా... అనేది మాత్రం తెలియదు. ఆర్డరిచ్చేశాం... డెలివరీ బాయ్ ఆహారం తీసుకొచ్చేశాడు... తినేశామా అన్నట్లుగానే పరిస్థితి ఉంది తప్ప ఆహారం తాజాగా తయారు చేసినేదా లేకుంటే అప్పుడెప్పుడో రాత్రి తయారు చేసి ఉదయం వేడి చేసి పంపిస్తున్నారా అనేది ఎవ్వరికీ తెలియదు. అంతేకాదు ఈ మధ్య ఆన్‌లైన్ ఆర్డర్స్‌లో ఆహారం ఆర్డరిస్తే చాలా తేడా కనిపిస్తోంది. రుచిలో తేడా.. ఒకటి ఆర్డరు ఇస్తే మరొకటి రావడం జరుగుతోంది. ఇక పరిశుభ్రత అంశాన్ని పక్కన పెట్టాల్సిందే. దానికి అస్సలు గ్యారెంటీ ఉండదు. తాజాగా ఓ వ్యక్తి ఆహారాన్ని స్విగ్గీలో ఆర్డర్ చేశాడు. ఆర్డరు ఇంటికి వచ్చింది.... తెరిచి చూడగానే ఆ వ్యక్తికి కడుపు మొత్తం తిప్పేసింది. ఇంతకీ ఆ ఆర్డరులో ఏముందనేగా మీ డౌటే అయితే ఇది చదవండి....

స్విగ్గీలో ఆహారం ఆర్డర్

స్విగ్గీలో ఆహారం ఆర్డర్

బిజీ లైఫ్‌‌లో సొంతపనులు చేసుకునేందుకు కూడా చాలామందికి సమయందొరకడం లేదు. ముఖ్యంగా నగరవాసులైతే వారి పనుల్లో బిజీగా మారి ఆన్‌లైన్ సేవలను ఆశ్రయిస్తున్నారు. ఉదయం నిద్రలేచాక బ్రేక్ ఫాస్ట్ నుంచి లంచ్ ఆపై డిన్నర్ వరకు అన్నీ ఆన్‌లైన్లోనే ఆర్డరిచ్చేస్తున్నారు. ఇక ఆ ఆహారం శుభ్రంగా ఉందా లేదా.. అప్పుడే ప్రిపేర్ చేశారా లేదా అనేది తెలుసుకోకుండానే పార్శిల్ వచ్చిన వెంబడే కడుపులోకి తోసేస్తున్నారు. తాజాగా చెన్నైలో ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డరిస్తే అతని పార్శిల్‌లో రక్తపు మరకలున్న బ్యాండేజీ దర్శనమిచ్చింది. ఆహారంలో బ్యాండేజీని చూసిన వ్యక్తి ఒక్కసారిగా అవాక్కయ్యాడు.

ఒక్కసారిగా అవాక్కయ్యాడు

ఒక్కసారిగా అవాక్కయ్యాడు

చెన్నై నగరం సెలయూర్ ప్రాంతంలో నివాసం ఉండే బాలమురుగన్ అనే వ్యక్తి ఆదివారం చాప్ ఎన్ స్టిక్స్ రెస్టారెంటు నుంచి భోజనం ఆర్డరిచ్చాడు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చాడు బాలమురుగన్. నూడిల్స్ ఆర్డరిచ్చిన బాలమురుగన్ టేస్ట్‌ను ఆస్వాదిస్తూ తింటుండగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. సగం తిన్న తర్వాత అందులో రక్తపుమరకలతో కూడిన బ్యాండేజ్‌ప్రత్యక్షమైంది. అంతే ఒక్కసారిగా కడుపులో అప్పటి వరకు ఉన్నదంతా బయటకొచ్చేసింది. వెంటనే కస్టమర్ కేర్‌కు మెసేజ్ పెట్టినప్పటికీ స్విగ్గీ ముందుగా స్పందించలేదని వెల్లడించాడు.

 స్విగ్గీ నుంచి వచ్చిన సమాధానం ఇదీ..!

స్విగ్గీ నుంచి వచ్చిన సమాధానం ఇదీ..!

ఇక తన భోజన కష్టాల గురించి బాలమురుగన్ తన ఫేస్‌బుక్‌లో రాసుకున్నాడు. మళ్లీ స్విగ్గీ కస్టమర్‌కేర్‌ను సంప్రదించగా వారు ఆర్డరును మాత్రమే మార్చగలమనే సమాధానం ఇచ్చినట్లు వెల్లడించాడు బాలమురుగన్. అసలు అప్పటికే తిన్న ఆహారంతో తనకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని తన పోస్టులో రాసుకొచ్చాడు బాలమురుగన్. అయితే రెస్టారెంటు వారు ఆహారాన్ని ప్యాక్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలని కోరాడు. జరిగిన ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని స్విగ్గీ చెప్పినప్పటికీ ఇంకా అదే రెస్టారెంటు నుంచి స్విగ్గీ ఆర్డర్లు స్వీకరిస్తోందని ధ్వజమెత్తాడు బాలమురగన్.

మొత్తానికి బాలమురుగన్‌కు ఎదురైన చేదు అనుభవం మరెవ్వరికీ ఎదురుకాకూడదంటే కాస్త సమయం తీసుకున్నప్పటికీ... ఇంట్లో వంట చేసుకుని తినడమే బెస్ట్ అంటున్నారు ఫుడ్ లవర్స్.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Let's block ads! (Why?)