0, 12 February, 2019

ఏప్రిల్ నుండి ఆసరా లబ్దిదారుల కళ్ళల్లో రెట్టింపు ఆనందం ...రీజన్ ఇదే

Telangana

oi-Veenavani D

|

తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు 57 ఏళ్ల కు కుదించిన నేపథ్యంలో వృద్ధాప్య పింఛన్లు భారీగా పెరగనున్నాయి. ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు పైబడిన వారందరికీ పింఛన్లు అందించి ఆసరా ఇవ్వనున్నారు. ఏప్రిల్ నెల నుండి కొత్త వారికి సైతం ఆసరా పింఛన్లు తెలంగాణ ప్రభుత్వం అందించనుంది. ఇప్పటివరకు 60 ఏళ్లకు పైబడిన వారికి పింఛన్ ఇస్తుండగా ఏప్రిల్ నుండి 57 ఏళ్లు పైబడిన వారందరికీ పింఛన్ ఇవ్వం ఉండడంతో అదనంగా 10 లక్షల మంది లబ్ధిదారులు చేరనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో ప్రస్తుతం ఆసరా పింఛన్ లబ్ధిదారులు 39.6 4 లక్షల మంది ఉండగా అందులో వృద్ధాప్య పింఛన్లు 13,33,053. అయితే ఈ జాబితాలో కనీసం మరో 8 లక్షలు కొత్తగా వచ్చి చేరే అవకాశం ఉంది. ఈ లెక్కన వృద్ధాప్య పింఛన్లు పొందే లబ్ధిదారులే వచ్చే ఏప్రిల్ నుండి 20 లక్షలకు చేరనున్నారు. దీనితో మొత్తం ఆసరా పింఛన్ల దారుల సంఖ్య 50 లక్షలకు చేరే అవకాశం ఉంది. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని, వారి నుండి దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారుల జాబితాను ఫైనల్ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు బారులు తీరారు. ఒక వరంగల్ రూరల్ కలెక్టర్ కార్యాలయంలోనే ఒక్క రోజులో 19వందల మంది నుండి పింఛను దరఖాస్తు వచ్చినట్లుగా సమాచారం.

Asara beneficiaries are delighted from April.. This is the reason

ఇప్పటివరకు ఆసరా పింఛన్ల కు ఏడాదికి సగటున ఐదు వేల కోట్లు ఖర్చవుతుండగా, ఏప్రిల్ నుండి ఏడాదికి సగటున 10 నుండి 12 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక అంతే కాకుండా పింఛను మొత్తాన్ని కూడా పెంచుతామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఏప్రిల్ నుండి పెంచిన మొత్తాన్ని అందించాలని నిర్ణయించారు. వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయల పింఛన్ ఇప్పటివరకు ఇస్తుంటే ఏప్రిల్ నుండి నెలకు 2016 రూపాయలు ఇవ్వనున్నారు. వికలాంగులకు రూ. 1500 కు బదులుగా 3016 రూపాయలు అందనున్నాయి.

దీంతో 57 ఏళ్లకు పైబడిన వారందరూ దరఖాస్తులు చేసుకుంటుండటంతో కలెక్టర్ కార్యాలయాలు లబ్దిదారులతో పోటెత్తుతున్నాయి. ఏప్రిల్ నుండి అమలు కానున్న సరికొత్త ఆసరా పించన్లు ప్రజలకు ఆసరా అందించటం ఆనందదాయకమే అయినా ప్రభుత్వ ఖజానా మీద పెనుభారమే పడనుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Let's block ads! (Why?)