0, 15 March, 2019

శాలువాలు క‌ప్పినోళ్లే గోతులు త‌వ్విండ్రు..! వాళ్ల సంగ‌తి తేలుస్తానంటున్న ఈటెల‌..!!

Hyderabad

oi-Harikrishna

|

సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారు.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటెల ! | Oneindia Telugu

హుజారాబాద్/ హైద‌రాబాద్ : ఏదో ఒక సంద‌ర్బాంల్లో కొంద‌రు నేత‌లు త‌మ ఆవేద‌నంతా వెళ్ల‌బోసుకుంటారు. మ‌రి కొంద‌రు నేత‌లు బోరుమ‌ని ఏడ్చేస్తారు. త‌మ బాద‌నంతా క‌న్నీళ్ల రూపంలో క‌క్కేస్తారు. ఇక రాజ‌కీయ నాయ‌కుల‌లైతే ప‌బ్లిక్ గా బ‌హ‌రంగ స‌భ‌ల్లో త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని, అందుకు కారుకులైన వారిని టార్గెల్ చేస్తుంటారు. తాజాగా ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద‌ర్ ఇదే ప‌ని చేసారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనకు నియోజకవర్గంలోని సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని అన్నారు.

చంద్రబాబుకు సన్నిహితుడి భారీ షాక్, కాంగ్రెస్‌లోకి నామా: కేటీఆర్ ద్వారా లాబీయింగ్, నో చెప్పిన కేసీఆర్

పార్లమెంట్ ఎన్నికల కోసం కరీంనగర్ లో 17న జరిగే ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు సభను విజయవంతం చేయాలని ఆయన హుజారాబాద్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో చెప్పారు. ఎంపీగా వినోద్ కుమార్ ను మరోసారి గెలిపించాలని కోరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనపై సోషల్ మీడియాలో విస్తృతంగా అసత్యపు ప్రచారాలు చేశారనీ, అవన్నీ అబద్ధాలని తేలిపోయాయ‌ని ఈటెల తెలిపారు.

Those who facilitated are cheated..! Etela Rajendar fired on party cadre..!!

ఇక త‌న‌తో మంచిగా ఉన్నట్లు న‌టిస్తూ, శాలువాలు కప్పి, త‌న వెనుకాల వేరే విధంగా మాట్లాడుతున్న వారిని క్షమించనని హెచ్చ‌రించారు ఈటెల‌. మొన్నటి ముంద‌స్తు ఎన్నికలతో త‌న‌కు ఎవరేమిటో తెలిసిందని. త‌న‌కు గ్రూపు రాజ‌కీయాలు తెలియ‌వ‌ని, కల్మషం లేని రాజ‌కీయ నాయ‌కుడిన‌ని చెప్పుకొచ్చారు. 81.6% శాతం ఈ నియోజకవర్గంలో టీఆరెస్ పార్టీ ఉందని కేసీఆర్ అన్నారని, కానీ కొంత మెజార్టీ తగ్గి మొన్నటి ఫలితాలు నిరాశ పరిచాయని ఈటెల అన్నారు.

త‌న‌కు వెన్నుపోటు పొడిచేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నించార‌ని, త‌న‌కు అన్యాయం చేసినా, టీఆరెస్ పార్టీ కి వెన్నుపోటు పొడవద్ద‌ని పార్టీలో కొంత మందినేత‌ల‌ను ఉద్దేశించి పేర్కొన‌డం సంచ‌ల‌నంగా మారింది. పార్లమెంట్ ఎన్నికలలో టీఆరెస్ పార్టీకి పట్టం కట్టాల‌ని, కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలలో ఇతర పార్టీలకు డిపాజిట్ కూడా దక్కకుండా చెయ్యాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. స‌న్నాహ‌క స‌మావేశంలో త‌న ఆవేద‌న‌ను వెలుబుచ్చుతూనే పార్టీ అభ్య‌ర్థిని గెలిపించాల‌ని ఈటెల కార్య‌క‌ర్త‌ల‌ను కోరడం ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా మారింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Let's block ads! (Why?)