0, 24 April, 2019

ఈదేశం ఉండగా అమెరికా దండగా: ఆదేశానికి పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్న భారతీయులు..కారణమిదే..!

ట్రంప్‌ రాకతో హెచ్‌1 బీ వీసాలపై గందరగోళం

ట్రంప్‌ రాకతో హెచ్‌1 బీ వీసాలపై గందరగోళం

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలనాపరమైన నిర్ణయాల్లో భాగంగా హెచ్‌ 1 బీ వీసాలపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇది అమెరికాకు వెళ్లాలనుకుంటున్న భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హెచ్‌ 1 బీ వీసా ఒకప్పటిలా లేదు. కొత్త నిబంధనలతో భారతీయుల్లో ఆందోళన నెలకొంది. దీంతో వారికి హెచ్‌ 1 బీ వీసా వస్తుందో లేదో అనే టెన్షన్ లేకుండా ఎంచక్కా కెనడాకు క్యూ కట్టేస్తున్నారు ఇండియన్స్.అమెరికాలో హెచ్‌1బీ వీసాపై ఉన్నవారు భారతీయులే ఎక్కువ. అక్కడ ఉన్న భారతీయుల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఎక్కువగా ఉన్నారు.ప్రతి ఏడాది హెచ్‌1బీ వీసాలపై వెళ్లే వారి సంఖ్య దాదాపు 85వేలుగా ఉంది.

 భారతీయులకు రెడ్ కార్పెట్ పరుస్తున్న కెనడా

భారతీయులకు రెడ్ కార్పెట్ పరుస్తున్న కెనడా

గ్లోబల్ స్కిల్స్ స్ట్రాటజీ అనే ప్రోగ్రాంను కెనడా ప్రభుత్వం 2017లో తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 2018 నాటికి 3లక్షల10వేల మందికి తమ దేశం శాశ్వత నివాసితుల హోదాను కల్పించాలన్న లక్ష్యం పెట్టుకుంది. 2019 నాటికి ఈ టార్గెట్ 3 లక్షల 30వేలకు పెంచింది. 'బిల్డింగ్ ఎ నేషన్ ఆఫ్ ఇన్నోవేటర్స్' పేరుతో కెనడా ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్టు ప్రకారం కెనడాలో పనిచేసేందుకు రావాలని భావిస్తున్న వారికి 40,833 ఉద్యోగాలు ,3,625 దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది. ఇక చాలామంది సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ అమెరికా వైపు కాకుండా కెనడా వైపు చూస్తున్నారని ఇందుకు కారణం కెనడా వీసా ప్రక్రియ చాలా సులభతరంగా ఉండటమే అని ఓ స్టార్టప్ కంపెనీ చెప్పింది. అంతేకాదు అమెరికాలో పని చేసిన తర్వాత ఎవరైనా తిరిగి భారత్‌కు చేరుకోవాలనుకునే వారికి కెనడా తొలి ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించింది.

మూడేళ్లకే కెనడా పౌరసత్వం..అమెరికాతో పోలిస్తే జీతాలు కాస్త తక్కువే

మూడేళ్లకే కెనడా పౌరసత్వం..అమెరికాతో పోలిస్తే జీతాలు కాస్త తక్కువే

అమెరికాలో హెచ్1బీ వీసాపై ఉన్నవారికి మరింత పొడగింపు ఇస్తుందో లేదో అన్న సందిగ్ధంలో ఉన్నవారు కెనడాకు వచ్చి ఎలాంటి టెన్షన్ లేకుండా తమ పని చేసుకుపోతున్నట్లు కెనడా వివరించింది.ఇలా వచ్చిన వారిలో ఎక్కువగా డేటా అనలిటిక్స్ పై పని చేసే వారే అని చెప్పుకొచ్చింది. ఇక ప్రముఖ టెక్ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, అమెరికాలో ఉన్న టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ కంపెనీలో పనిచేస్తున్న చాలా మందికి హెచ్‌1 బీ వీసాలు అమెరికా తిరస్కరించింది. ఈ సమాచారం అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ సంస్థ వెల్లడించింది. మరోవైపు కెనడాలో మూడేళ్ల పాటు ఉన్న విదేశీయులకు ఆ దేశం పౌరసత్వం ఇస్తోంది. అదే అమెరికాలో అయితే గ్రీన్ కార్డు పొందేందుకు దాదాపు 10 ఏళ్లు ఉండాల్సి వస్తోంది.

గత రెండేళ్లలో చూస్తే కెనడాలో పనిచేసేందుకు 3500 ఆఫర్ లెటర్లను అక్కడి కంపెనీలు జారీచేశాయి. అయితే అమెరికాతో పోలిస్తే కెనడాలో జీతభత్యాలు కాస్త తక్కువే అని చెప్పాలి. అయితే కెనడా పౌరసత్వం లభించడం చాలా త్వరగా జరిగిపోతుంది. ఇప్పటికే భారత్ నుంచి కెనడాకు వెళ్లి అక్కడే స్థిరపడుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతేకాదు భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు లాక్వెస్ట్ సంస్థ మేనేజింగ్ పార్ట్‌నర్ పూర్వి చోతాని.మొత్తానికి హెచ్‌1బీ వీసాల గోలతో కెనడా ఉండగా అమెరికా దండగా అని చాలా మంది టెక్ ప్రొఫెషనల్స్ అభిప్రాయపడుతున్నారు.

Let's block ads! (Why?)