0, 23 February, 2021

షాకింగ్: 14 ఏళ్ల బాలికను పెళ్లాడిన 50ఏళ్ల పాకిస్థాన్ ఎంపీ

International

oi-Rajashekhar Garrepally

|

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో అనేక దారుణాలు బయటికి రాకుండానే ఉంటాయి. కానీ, ఇటీవల కాలంలో వార్త సంస్థలు, సోషల్ మీడియా కారణంగా ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ఆ దేశంలో మైనార్టీలపై దాడులు సాధారణం అయిపోయిన విషయం తెలిసిందే. తాజాగా, ఓ దారుణం వెలుగులోకి వచ్చింది.

పాకిస్థాన్‌కు చెందిన ఓ పార్లమెంటు సభ్యుడు 14 ఏళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు, అతని ఫొటోలు బయటికి రావడం, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు ఎంపీపై నెటిజన్లు తీవ్రంగా మడిపడుతున్నారు.

Pakistan MP Who is in His Late Fifties, Marries 14-Year-Old Baloch Girl

వివరాల్లోకి వెళితే.. జమియత్ ఉలేమా ఏ ఇస్లాం నేత, పాకిస్థాన్ ఎంపీ మౌలానా సలాహుద్దీన్ అయూబీ అనే 50ఏళ్ల ఎంపీ.. బలూచిస్థాన్‌కు చెందిన 14 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. స్థానిక జుగూర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఆ బాలిక 2006, అక్టోబర్ 28న జన్మించినట్లు రికార్డుల్లో నమోదైంది.

దీని ప్రకారం ఆ ఎంపీ.. 14 మైనర్ బాలికను వివాహం చేసుకున్నట్లు తేలింది.

ఈ క్రమంలో స్థానిక మహిళా సంక్షేమ స్వచ్ఛంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మైనర్ బాలికతో ఎంపీ వివాహంపై విచారణ జరిపారు. అయితే, తాము ఈ పెళ్లి చేయలేదని, తమకు పెళ్లితో ఎలాంటి సంబంధం లేదని బాలిక తల్లిదండ్రులు అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం. కాగా, పాకిస్థాన్ చట్టాల ప్రకారం 16ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారి వివాహం చెల్లదు. అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.

Let's block ads! (Why?)