0, 23 April, 2021

Mars:MOXIE అంటే ఏంటి..? అంగారకుడిపై ఆక్సిజన్ ఎలా ఉత్పత్తి అవుతుంది..(వీడియో)

International

oi-Kannaiah

|

ఓ వైపు భూమిపై కోవిడ్ కారణంగా చాలా దేశాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంటే... అంగారక గ్రహంలో ఆక్సిజన్‌ తయారు చేసే ప్రక్రియను నాసా ప్రారంభించింది. అంగారక గ్రహంపై మనిషి మనుగడ గురించి పరిశోధనలు చేస్తున్న నాసా తాజాగా మార్స్ పై ఆక్సిజన్‌ను తయారు చేస్తోంది. అంగారక గ్రహంపై మనిషి ఉండేందుకు కావాల్సిన ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇందుకు మాక్సీ (MOXIE) అనే పరికరంను వినియోగిస్తోంది. మాక్సీ అంటే మార్స్ ఆక్సిజన్ ఇన్-సితు రీసోర్స్ యుటిలైజేషన్ ఎక్స్‌పెరిమెంట్.

అంగారకుడిపై ఉన్న కార్బన్ డైయాక్సైడ్ నుంచి ఆక్జిజన్ ఉత్పత్తి చేయడం ఈ మాక్సీ యొక్క ప్రధాన లక్ష్యం. దీని బరువు 17.1 కిలోలు. ఇక దీని కోసం 300 వాట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. భూమిపై దీని బరువు 37.7 పౌండ్లు ఉండగా.. అంగారకుడిపై 14.14 పౌండ్లుగా ఉంది. ఒక్క ప్రయోగం ద్వారా గంట వరకు ఉండేలా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇక అంగారకుడిపై మనిషిని పంపినప్పుడు సాధారణంగా తమతో పాటు ఆక్సిజన్ తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక ఆ అవసరం లేకుండా అక్కడే ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశామని ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ మైకేల్ హెక్ట్ అన్నారు. అయితే ఒక ఖాళీ ఆక్సిజన్ ట్యాంకును అంగారకుడిపైకి తీసుకెళ్లి అక్కడ ఆక్సిజన్ నింపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Mars:What is MoXIE, How is oxygen produced on the red planet,know the details here

అంగారకుడిపై 95శాతం కార్బన్ డైయాక్సైడ్ ఉంది. ఆక్సిజన్ కేవలం 0.13శాతం మాత్రమే ఉంది. అదే భూమిపై 21శాతం ఉంది. మాక్సీ పరికరం కారు బ్యాటరీ సైజులో ఉంటుంది. అయితే భవిష్యత్తులో మనిషికి కావాల్సిన ఆక్సిజన్ సరఫరా చేయాలంటే ప్రస్తుతం ఉన్న సైజు కంటే 100 రెట్టు పెద్దదిగా ఉండాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చెట్లు ఎలాగైతే ఆక్సిజన్‌ను ఇస్తాయో అదేలా మాక్సీ కూడా ఉత్పత్తి చేస్తుంది. సాధారణంగా అంగారకుడిపై అన్వేషణ జరపాలంటే 3/4వ వంతు ఆక్సిజన్ అవసరం అవుతుంది. అయితే మాక్సీ ఇంతకంటే ఎక్కువగా ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మాక్సీ పేరు వెనక ఉన్న కథ...

మాక్సీ అంటే ఓ పరికరంకు పెట్టిన పేరు. మార్స్ పై మానవుడు అడుగుపెట్టిన దగ్గర నుంచి అతని అన్వేషణకు కావాల్సిన ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే మాక్సీ అనే ఈ పేరు ఇప్పటిది కాదని 1800వ సంవత్సరంలోనే ఈ పేరు అమెరికాలో వినియోగించే వారని తెలుస్తోంది. మాక్సీకి అర్థం డార్క్ వాటర్. అప్పట్లో అమెరికన్లు మాక్సీ అనే టానిక్‌ తీసుకునేవారు. కాలక్రమంలో అది సాఫ్ట్ డ్రింక్‌గా అవతరించింది.అయితే ఈ డ్రింక్‌లో చాలా ఆరోగ్య లాభాలున్నాయి. ఇప్పుడు కూడా పాతతరం నాటి సోడా దుకాణాల్లో మాక్సీ డ్రింక్ లభిస్తుంది.

Adblock test (Why?)