0, 4 May, 2021

మొదలైన అసలు యుద్దం.!ఈటలపై స్వపార్టీ నేతల విమర్శనాస్త్రాలు.!రాజేందర్ రియాక్షన్ పై ఉత్కంఠ.!

Telangana

oi-Harikrishna

|

హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ అంశంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈటల భూఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపణలు వెలుగు చూడడం, స్వయంగా ముఖ్యమంత్రే విచారణకు ఆదేశించడం, ఆరోపణల్లో వాస్తవం ఉందని నిర్ధారించి ఈటలను మంత్రి పదవినుండి తొలగించడం వంటి అంశాలు చకచకా జరిగిపోయాయి. ఈటల రాజేందర్ భూఆక్రమణలు, సీఎం చర్యల గురించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గర ప్రస్తావించినా ఆ అంశం సీఎం పరిదిలో ఉంది, ఇప్పుడు స్పందించలేం అనే సమాధానం నిన్నిటి వరకు వినిపించింది, కాని రాత్రికి రాత్రే సీన్ మారినట్టు తెలుస్తోంది.

 హుజురాబాద్లో బిసి, హైద‌రాబాద్లో ఓసీ ఈటెలపై మండిపడ్డ గంగుల.. ఈటల ఎపిసోడ్ లో ఆసక్తికర మలుపు..

హుజురాబాద్లో బిసి, హైద‌రాబాద్లో ఓసీ ఈటెలపై మండిపడ్డ గంగుల.. ఈటల ఎపిసోడ్ లో ఆసక్తికర మలుపు..

మంత్రి వర్గంనుండి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ అంశంలో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వంలో మంత్రిగానో, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న అభ్యర్థుల మీద అవినీతి ఆరోపణలు చేయడం, చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు ఒత్తిడి తేవడం సర్వ సాధారణం. ఒకవేళ ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయక పోతే ధర్మాలు, నిరసనలు వంటి ఉద్యమాలకు ప్రతిపక్షాలు శ్రీకారం చుట్టడం కూడా సర్వ సాధారణమే. కానీ ఈటల అంశంలో వివాదం గాని, ఆరోపణలు గానీ సొంతపార్టీనుండే ఉద్భవించాయి. స్వయంగా ముఖ్యమంత్రే విచారణకు ఆదేశించడం కూడా కీలక మలుపే.

 త‌ల్లిలాంటి పార్టీపై కుట్ర‌లు.. ఈటలది నీచ‌ వ్య‌క్తిత్వమన్న మంత్రి గంగుల..

త‌ల్లిలాంటి పార్టీపై కుట్ర‌లు.. ఈటలది నీచ‌ వ్య‌క్తిత్వమన్న మంత్రి గంగుల..

త‌ల్లిలాంటి పార్టీపై కుట్ర‌లు.. ఈటలది నీచ‌ వ్య‌క్తిత్వమన్న మంత్రి గంగుల..కాగా నిన్నటి వరకు ఈటల అంశం కాస్త గంభీరంగా కొనసాగింది. సహచర మంత్రులు ఎవ్వరు కూడా ఈటల ఎపిసోడ్ గురించి ఎక్కడా స్పందించకపోడం, ఎమ్మెల్యేలు కూడా ఎక్కడా మాట్లాడకపోవడంతో ఏలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నయో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కాని ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నుండే మరో మంత్రి ఈటల గురించి మొట్ట మొదట స్పందించి ఎపిసోడ్ ను మరింత రసకందాయంగా మార్చారు. గులాబీ నాయకులు అందరూ ఈటల అంశంలో సంయమనం పాటించినా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు విమర్శలు గుప్పించడం ఆసక్తికరంగా మారింది.

 బిసిలు ఎవ‌రూ ఈటలతో లేరు.. నాలుగు రోజుల్లో వాస్తవాలు వెలుగుచూస్తాయన్న మంత్రి కమలాకర్..

బిసిలు ఎవ‌రూ ఈటలతో లేరు.. నాలుగు రోజుల్లో వాస్తవాలు వెలుగుచూస్తాయన్న మంత్రి కమలాకర్..

కరీంనగర్ జిల్లాకు చెందిన సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మొట్ట మొదట సారి తీవ్ర విమర్శలు చేసారు. తెలంగాణ భవన్ లో కమాలకర్ మాట్లాడుతూ ఈటల మీద అనేక ఆరోపణలు చేసారు. ఈటల రాజేందర్ పార్టీ పటిష్టతకోసం చేసింది ఏమీ లేదని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రెక్కల కష్టంతోనే పార్టీ బలోపేతం అయ్యిందని స్పష్టం చేసారు గంగుల కమలాకర్. ఉద్యమంలో ఉన్నప్పటికి స్వలాభం చూసుకున్న ఈటల సిసలైన తెలంగాణ వాది కాదని సంచలన ఆరోపణలు వ్యక్తం చేసారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిర్గతం చేసేందుకు ఉత్సాహం చూపే ఈటల వల్ల నష్టమే తప్ప పార్టీకి లాభం లేదని తేల్చి చెప్పారు గంగుల.

 కేసీఆర్ ను, పార్టీని కించ‌పరిస్తే ఊరుకునేది లేదు.. ఈటలను హెచ్చరించిన గంగుల క‌మ‌లాక‌ర్..

కేసీఆర్ ను, పార్టీని కించ‌పరిస్తే ఊరుకునేది లేదు.. ఈటలను హెచ్చరించిన గంగుల క‌మ‌లాక‌ర్..

అంతే కాకుండా ఈటల రాజేందర్ త‌న స్థాయిని మించి మాట్లాడ‌టం స‌రికాద‌న్నారు గంగుల. జిల్లాలో బిసి నాయ‌క‌త్వాన్ని ఎద‌గ‌కుండా చేయ‌డ‌మే కాక రాష్ట్ర స్థాయిలో సైతం బీసీలు ఎదుగుతే ఎక్క‌డ త‌న మంత్రి ప‌ద‌వికి పోటీ అవుతారోన‌ని నిరంత‌రం వారిని అణ‌గ‌దొక్కే నీచ వ్య‌క్తిత్వం ఈటల‌ద‌ని గంగుల ఘాటుగా విమర్శించారు. 2018లో జిల్లాలో బీసీ నేత‌ల్ని ఎంద‌రిని ఓడించ‌డానికి ఈటెల ప్ర‌య‌త్నించారో అంద‌రికీ తెలుస‌ని, సొంత పార్టీ నేత‌లు ఓడిపోతే సంతోష‌ప‌డే తత్వం ఈటలదని మండిపడ్డారు. ఎప్ప‌టినుండో వేరుకుంప‌టి పెట్టుకొని పార్టీని చీల్చే కుట్ర‌ల‌కు తెర‌లేప‌డ‌మే కాక ఇందుకోసం ప్ర‌తిప‌క్షాల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న విష‌యం బ‌హిరంగ ర‌హ‌స్య‌మేన‌ని సంచలన ఆరోపణలు చేసారు మంత్రి గంగుల కమలాకర్.

Adblock test (Why?)