Telangana
oi-Rajashekhar Garrepally
వాషింగ్టన్/హైదరాబాద్: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన యువకుడు మృతి చెందాడు. అమెరికాలోని ఒహయో రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాకు చెందిన నరేంద్రుని చిరు సాయి ఉద్యోగం చేస్తున్నాడు. రోజూ లాగే ఈ రోజు కూడా డ్యూటీ ముగించుకుని ముగించుకొని తన గదికి వెళ్తున్న సమయంలో చిరు సాయి ప్రయాణిస్తున్న కారును టిప్పర్ కొట్టింది.
తీవ్రంగా మంచు కురుస్తుండటంతో టిప్పర్ వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. దీంతో చిరుసాయి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమయంలో చిరు సాయితో కలిసి ప్రయాణిస్తున్న నల్గొండ జిల్లాకు చెందిన మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ వ్యక్తి కోమాలో ఉన్నట్లు సమాచారం.

సూర్యాపేటకు చెందిన లింగమూర్తి, సుధారాణి దంపతుల ఏకైక కుమారుడు చిరుసాయి. ఏడాదిన్నర క్రితమే ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. ఇవాళ షాపింగ్ ముగించుకుని రూమ్ కు తిరిగి వెళ్తున్న సమయంలో టిప్పర్ ఢీకొట్టింది. ఒక్కగానొక్క కొడుకు రోడ్డుప్రమాదంలో చనిపోవడంతో చిరుసాయి తల్లితండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
మృతుడి కుటుంబ సభ్యులను మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు. అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు తదితరులు సూర్యాపేటలో నివసిస్తున్న చిరుసాయి తల్లిదండ్రులను పరామర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడి చిరుసాయి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొస్తామని చెప్పి, ఓదార్చారు.
English summary
road accident in america: suryapet resident killed, another one injured.
Story first published: Sunday, November 28, 2021, 20:33 [IST]