0, 29 November, 2021

టీఆర్ఎస్ లో కేసీఆర్ భజన చేసే వారికే స్థానం; ఉద్యమకారులకు చోటు లేదు: ఈటల రాజేందర్ సెన్సేషన్

టీఆర్ఎస్ లో ఉద్యమ కారులకు చోటు లేదు, భజనపరులకే స్థానం

టీఆర్ఎస్ లో ఉద్యమ కారులకు చోటు లేదు, భజనపరులకే స్థానం

తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉద్యమకారులకు చోటులేదని, కేవలం భజన పరులకు మాత్రమే చోటు ఉందంటూ హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పాల్వంచ తెలంగాణ నగర్ లో స్థానిక ప్రజలతో మాట్లాడుతున్న ఈటల సీఎం కేసీఆర్ తీరును ఎండగడుతున్నారు. పాల్వంచ లో పర్యటిస్తున్న ఈటల రాజేందర్ కు బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడ స్థానిక ప్రజలతో మాట్లాడుతున్న ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బడుగు బలహీన వర్గాలను టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోదు: ఈటల

బడుగు బలహీన వర్గాలను టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోదు: ఈటల

బడుగు బలహీన వర్గాలను టిఆర్ఎస్ పార్టీ పట్టించుకోదు అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ నగర్ లో నివాసం ఉండేది నిరుపేదలని పేర్కొన్న ఈటల రాజేందర్, అందుకే వారి ఇళ్ల పట్టాల గురించి పట్టించుకోవడం లేదని, వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదని కెసిఆర్ సర్కారుపై మండిపడ్డారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఈటల రాజేందర్ కెసిఆర్ ధనవంతులకు, వందల ఎకరాలు ఆక్రమించుకున్న వాళ్లకు, బ్రోకర్లకు వత్తాసు పలుకుతోందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీనే

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీనే

ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే పట్టాలు ఇవ్వలేని కేసీఆర్ డబల్ బెడ్ రూమ్ ఇళ్లు ఏ విధంగా ఇస్తారు అంటూ ప్రశ్నించారు. టిఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులను ఉండనివ్వరు అని తేల్చి చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కెసిఆర్ కు, టిఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీ నేనని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ లో రోజురోజుకీ అసహనం పెరిగిపోతుందని పేర్కొన్న ఆయన టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని తేల్చి చెబుతున్నారు. కెసిఆర్ ను ఢీ కొట్టే పార్టీ బిజెపినేనని ఈటల రాజేందర్ తేల్చి చెబుతున్నారు.

ధాన్యం కొనుగోళ్ళపైన కూడా కేసీఆర్ టార్గెట్ గా ఈటల ధ్వజం

ధాన్యం కొనుగోళ్ళపైన కూడా కేసీఆర్ టార్గెట్ గా ఈటల ధ్వజం

ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ తీరును పదేపదే టార్గెట్ చేస్తున్న ఈటల రాజేందర్ ధాన్యం కొనుగోలు విషయంలో కూడా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. రైతేడ్చిన రాజ్యం బాగుపడదని ఈటల పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా ముఖ్యమంత్రి మొద్దు నిద్రలో ఉన్నారని ఈటల రాజేందర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెపుతున్న కేసీఆర్ ధాన్యం ఎందుకు కొనలేకపోతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

Adblock test (Why?)