India
oi-Syed Ahmed
ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తున్న ఓమిక్రాన్ వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఇవాళ కీలకమైన అలర్ట్ జారీ చేసింది. ఈ వైరస్ ప్రభావంతో పాటు ఇది సోకితే తలెత్తే పరిణామాలపైనా ప్రపంచ ఆరోగ్యసంస్ధ చేసిన హెచ్చరికలు అంతర్జాతీయంగా సంచలనం రేపుతున్నాయి. దీంతో ఇక ఏమాత్రం ఏమరుపాటుగా ఉండే పరిస్ధితులు లేవని తెలుస్తోంది.
కొత్త కోవిడ్ -19 ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా "చాలా ఎక్కువ" ప్రమాదాన్ని కలిగి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇవాళ హెచ్చరించింది. ఇదెంత తీవ్రమైనది, ఏ మేరకు ప్రభావం చూపుతందనే దానిపై ఇంకా అనిశ్చితి కొనసాగుతుందని పేర్కొంది. కరోనా యొక్క మరొక పెద్ద ఉప్పెనగా ఓమిక్రాన్ మారితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చని డబ్ల్యూహెచ్వో అంచనా వేస్తోంది. అయితే ఓ వైరస్ కారణంగా ఇప్పటివరకూ మరణాలు మాత్రం నమోదు కాలేదని తెలిపింది.

ఇప్పటికే ప్రపంచ ఆరోగ్యసంస్ధ ప్రమాదకారులుగా గుర్తించిన ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వైరస్ ల సరసన ఈ ఓమిక్రాన్ వైరస్ ను కూడా చేరుస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ ఒక్కాసారిగా అప్రమత్తమయ్యాయి. విదేశాల నుంచి విమానాల రాకపోకల్ని రద్దు చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్లపైనా దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై సైతం ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. అసలే కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లతో తీవ్రంగా దెబ్బతిని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్ధిక వ్యవస్ధలకు ఈ ఓమిక్రాన్ తీవ్రంగా దెబ్బతీస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కోవిడ్ వ్యాక్సిన్లు, పరీక్షలు, చికిత్సలకు వ్యాప్తి తీవ్రత లేదా చిక్కులలో ఏవైనా మార్పులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఓమిక్రాన్ అధ్యయనాలను పూర్తి చేయడానికి చాలా వారాలు పట్టవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్ధ అభిప్రాయపడుతోంది. ఆ లోపు ప్రపంచ దేశాల్ని అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది. ఇప్పటికే ఈ వైరస్ పై శరవేగంగా పరిశోధనలు సాగుతున్నాయని, దీని తీవ్రత లోతు మరింతగా తెలియాలంటే కొంత సమయం పడుతుందని చెబుతోంది. దీంతో ఆయా దేశాలన్నీ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్ధ వెలువరించే పరిశోధనల వివరాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాయి.
English summary
the world health organisation on today said omicron virus risk is very high and the consequences are also severe.
Story first published: Monday, November 29, 2021, 15:34 [IST]