1, 26 September, 2016

Rasi Phalalu (25th Sep 2022) | రోజువారీ రాశి ఫలాలు

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

ఈ రోజు కుటుంబంలో చిక్కులు తొలగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

ఈ రోజు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

ఈ రోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థికపరమైన సమస్యలు చికాకు కలిగిస్తాయి చేపట్టిన పనులలో ఎంత కష్టించినా ఫలితం ఉండదు. బంధువుల నుంచి ఋణ ఒత్తిడులు తప్పవు. ఉద్యోగ వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

ఈ రోజు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపార,ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. కీలక వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

ఈ రోజు ఉద్యోగాలలో ఉన్నతాధికారులు నుండి ఆటుపోట్లు తప్పవు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు వలన నష్టాలు తప్పవు. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఈ రోజు సన్నిహితుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

ఈ రోజు కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయట నిరాశ తప్పదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

ఈ రోజు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

ఈ రోజు ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అనుకున్న పనుల్లో అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ప్రయాణాలు శ్రమతో కూడి ఉంటాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఈ రోజు ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. దూరప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సాదాసీదాగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధనం అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ఈ రోజు కుటుంబ విషయాలలో తొందరపాటు నిర్ణయం చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో నిదానంగా ప్రవర్తించడం మంచిది ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రుల నుంచి విమర్శలు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Recommended Video

పక్కా కమర్షియల్ పక్కా genuine రివ్యూ *Entertainment | Telugu OneIndia

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

ఈ రోజు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Adblock test (Why?)