0, 20 September, 2022

Breakfast Food: పరగడుపున ఈ ఆహారం తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త..

కడుపులోపలి భాగాలపై

కడుపులోపలి భాగాలపై

ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం తిన్నా అది నేరుగా కడుపులోపలి భాగాలపై ప్రభావం పడుతుందట. ఫలితంగా కడుపులో మంట, కడుపు నొప్పి, ఛాతీలో మంట, అజీర్తి వంటి సమస్యలు వస్తాయట. అందుకే ఉదయం వేళల్లో మసాలా లేదా ఫ్లైడ్ పదార్ధాలు తినకూడదట. కొందరు ఉదయం వేళ అంటే పరగడుపున కాఫీ లేదా టీ తాగుతారు. ఇలా చేయడం వల్ల ఛాతీలో మంట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయట.

ఆల్కహాల్

ఆల్కహాల్

అందరు పరగడుపున నీరు తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే పరగడుపున ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా ప్రమాదకరమట. ఇది నేరుగా మీ లివర్‌పై ప్రభావం చూపిస్తుందట. మీ రక్తంలో ఆల్కహాల్ వేగంగా వ్యాపిస్తుందట. అలాగే పరగడుపున కొన్న రకాల పండ్లను తినకూడదట. ద్రాక్ష, నిమ్మకాయలు, నారింజ, బేరి వంటి పుల్లని పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

విటమిన్ సీ, ఫ్రక్టోజ్

విటమిన్ సీ, ఫ్రక్టోజ్

ఈ పండ్లలో విటమిన్ సీ, ఫ్రక్టోజ్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట. అరటిని ఎప్పుడూ ఖాళీ కడుపుతో తినకూడదని చెబుతున్నారు. ఇది శరీరంలో మెగ్నీషియం మొత్తాన్ని పెంచడంతో పాటు కాల్షియం, మెగ్నీషియం స్థాయిలలో అసమతుల్యతను కలిగిస్తుందట.

Adblock test (Why?)