0, 15 March, 2019

వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంకోర్టు: ఎన్నికల సంఘానికి నోటీసులు: తదుపరి విచారణకు 25న

National

oi-Chandrasekhar Rao

|

న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దేశంలోని 21 ప్రతిపక్ష రాజకీయ పార్టీలు దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు వాదనలను ఆలకించింది. శుక్రవారం వాదనలను ఆలకించింది. అనంతరం- వీవీప్యాట్ లెక్కింపుపై తమ వైఖరి ఏమిటో తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నెల 25వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఈ కేసును 25వ తేదీకి వాయిదా వేసింది.

టీడీపీ తొలి జాబితాలో ఏ కులానికి ఎన్ని సీట్లో తెలుసా?

21 రాజకీయ పార్టీలు దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఉదయం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలను విన్న తరువాత.. రంజన్ గొగోయ్ ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేశారు. విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు. ఈ లోగా- తాము పంపించిన నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.

SC Issues Notice On Plea By 21 Political Parties For 50% VVPAT Verification

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో.. మరోసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం ద్వారా మెజారిటీలో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందంటూ బీజేపీయేతర ప్రతిపక్ష పార్టీలన్నీ గళమెత్తుతున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలంటూ ఇదివరకే నినదించిన ప్రతిపక్ష పార్టీలు.. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సమక్షానికి తీసుకెళ్లాయి.

ఓటు వేసిన తరువాత ఈవీఎంల నుంచి వెలువడే వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాలని కోరుతూ కాంగ్రెస్ కూటమిలోని పార్టీలు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశాయి. ఈ పిటీషన్ శుక్రవారం విచారణకు రానుంది. తెలుగుదేశం పార్టీ సహా మొత్తం 21 ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఈ పిటీషన్ పై సంతకాలు చేసి, సుప్రీంకోర్టుకు సమర్పించాయి.

ఈవీఎంలు దుర్వినియోగారిని గురవుతున్నాయని ప్రతిపక్షాలు కొన్నాళ్లుగా ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ఏ బటన్ నొక్కినా.. ఓటు మాత్రం బీజేపీకే పడుతోందంటూ అనుమానాలు వెల్లువెత్తిన సందర్భాలు ఉన్నాయి. ఈవీఎంలను ట్యాంపర్ చేసి, బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వచ్చిందంటూ ఇదివరకు విమర్శించిన ప్రతిపక్ష పార్టీలు న్యాయపోరాటానికి సిద్ధపడ్డాయి.

సార్వత్రిక, అసెంబ్లీ, ఉప ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు కనీసం 50 శాతం వీవీప్యాట్‌ పేపర్‌ స్లిప్‌లను లెక్కించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటు 21 మంది జాతీయ స్థాయి నేతలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏదో ఒక పోలింగ్‌ కేంద్రంలో వీవీప్యాట్‌ పేపర్‌ స్లిప్‌లను లెక్కించాలంటూ ఈసీ జారీ చేసిన మార్గదర్శక సూత్రాలను కొట్టివేయాలని వారు అభ్యర్థించారు.

ఏదో ఒక పోలింగ్ కేంద్రంలో వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడం వల్ల ఎంత మాత్రమూ ఉపయోగం ఉండదని, ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను కొట్టేయాలని కోరాయి. 50 శాతం మేర వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. శుక్రవారం విచారణ చేపట్టనుంది. ఈ పిటీషన్ పై సంతకాలు చేసిన నాయకుల్లో చంద్రబాబు నాయుడు, దేవేగౌడ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, డెరిక్ ఒబ్రెయిన్, సతీష్ మిశ్రా, సురవరం సుధాకర్ రెడ్డి, మనోజ్ ఝా, డానిష్ అలీ, అజిత్ సింగ్, అశోక్ కుమార్ సింగ్, బద్రుద్దీన్, కోదండరామ్, టీకే రంగరాజన్, ఫరూక్ అబ్దుల్లా, జీతన్ రామ్ మాంఝీ వంటి నాయకులు ఉన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

Let's block ads! (Why?)