0, 15 March, 2019

త‌ప్పు చేసి త‌ప్పించుకోవాల‌ని: సాక్ష్యాలు మాయం చేసారు: చిన్నాన్న హత్య జ‌రిగితే క‌రుణ లేదు..సీయం

వివేకా మృతి పై డ్రామాలు ఆడారు..

వివేకా మృతి పై డ్రామాలు ఆడారు..

వివేకానంద మృతి విష‌యంలో ఫిర్యాదు ఇవ్వ‌టం ద‌గ్గ‌ర నుండి ప్ర‌స్తుతం చేస్తున్న ఆరోప‌ణ‌ల వ‌ర‌కు వైసిపి నేత‌లు.. జ‌గ‌న్ కుటుంబ స‌భ్యులు డ్రామాలు ఆడుతున్నార‌ని ..వారి కుటుంబం లో జ‌రిగిన హ‌త్య లో వారే సాక్ష్యాల‌కు దాచి పెడుతున్నార‌ని వ్యాఖ్యానించారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ తనపై చేసిన ఆరోపణల ను తీవ్రంగా ఖండించారు. తన‌కు అందిన స‌మాచారం అంటూ సీయం ఘ‌ట‌న ను వివ‌రించారు. పీఏ ఇంటికి వెళ్లినా ఎందుకు తలుపు తీయలేదు. సీఐ ఇంటికి వెళ్లే లోపే రక్తపు మరకల్ని తుడిచేశారు. మృతదేహాన్ని బాత్‌రూమ్‌ నుంచి బెడ్‌రూమ్‌కు తరలించారు. పోస్టుమార్టం జరిగేవరకు గాయాల విషయం ఎందుకు దాచారు. గుండెపోటు అని ఎందుకు నమ్మించే ప్రయత్నించారు. హత్యకేసును ఎందుకు దాచిపెట్టాలనుకున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లే వరకూ ఎందుకు దాచారు..?. పోస్టుమార్టం జరుగుతున్నప్పుడే వాళ్ల మాటలు మారాయి. వాస్తవాలు దాచి మాపై ఆరోపణలు చేస్తారా అని ప్ర‌శ్నించారు. గుండెపోటుతో చనిపోయారని పోలీసులను కూడా నమ్మించారు. కేసులు కూడా అవసరం లేదన్నారు. హత్య అని తేలాక త‌మ పై ఆరోప‌ణ‌లు మొద‌లు పెట్టాల‌ర‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హ‌త్య అని తెలిసినా దాచి పెట్టారు.

హ‌త్య అని తెలిసినా దాచి పెట్టారు.

ఆస్పత్రిలో పోస్టుమార్టం తర్వాతే హత్య అని చెప్పారు. తలపై బలమైన గాయం ఉంది, ముందే ఎందుకు గుర్తించలే దన్నారు. అన్నీ బయటకు వచ్చాక స్వరం మార్చారు. చాలా దుర్మార్గమైన ఆరోపణలు చేస్తున్నారు. అవినాష్‌రెడ్డికి హత్య విషయం ఎవరు చెప్పారని ప్ర‌శ్నించారు. గంగిరెడ్డి, కృష్ణారెడ్డి సహా బంధువులందరూ వెళ్లి ఘటనాస్థలిని చూశా రు. జరిగింది హత్య అని ఎందుకు చెప్పలేకపోయారు. ఆస్పత్రిలోనూ సహజ మరణమనే చెప్పారని వివ‌రించారు. మృ తదేహాన్ని చూసినవారెవరైనా హత్యని చెప్పేస్తారు. మీ ఇంట్లో హత్య జరిగితే ఎందుకు దాచిపెట్టాలనుకున్నారు. ఇం ట్లో రక్తాన్ని కడిగేందుకు ఎవరికి అవసరం ఉంటుంది. బాత్‌రూమ్‌లో నుంచి బెడ్‌రూమ్‌లోకి ఎవరు తీసుకొచ్చారు. ఆస్ప త్రికి ఎవరు తీసుకెళ్లారు, బెడ్‌రూమ్‌ను ఎందుకు క్లీన్‌ చేశారు. మార్నింగ్‌ లేని లెటర్‌ ఈవెనింగ్‌ ఎలా వచ్చిందని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.

వివేకా మృతి పై అనుమానాలు : విచార‌ణకు సిట్ ఏర్పాటు : రాజ‌కీయ విమ‌ర్శ‌లు షురూ..!

చిన్నాన్న చ‌నిపోతే క‌రుణ లేదు

చిన్నాన్న చ‌నిపోతే క‌రుణ లేదు

సొంత చిన్నాన్న చ‌నిపోతే ఆ మ‌నిషికి కరుణ లేద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. డ్రామాలు వారే ఆడుతున్నార‌ని.. పార్టీ మీ విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. మృత‌దేహం పంచ‌నామ చేయ‌కుండా ఆస్ప‌త్రికి ఎలా త‌ర‌లిస్తార‌ని ప్ర‌శ్నించారు. మృత‌దేహం తీసుకెళ్తుంటే పోలీసులు సైతం మాట్లాడ‌కుండా ఉండ‌టం త‌ప్పేన‌న్నారు. పోలీసుల విచార‌ణ లో కుటుంబ స‌భ్యుల‌ను విచారిస్తే త‌ప్ప వాస్త‌వాలు రావ‌న్నారు. త‌ప్పు చేసి త‌ప్పించుకోవాల‌ని చూస్తున్నార ని..సాక్ష్యాలు కూడా అందుకే మాయం చేసార‌ని ఆరోపించారు.

Let's block ads! (Why?)