0, 8 April, 2021

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా.. కాంగ్రెస్ నేత, నటి నగ్మాకు కరోనా పాజిటివ్

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా నగ్మాకు కరోనా

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా నగ్మాకు కరోనా

ఇదే విషయాన్ని నగ్మా తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని పేర్కొంది

. కొన్ని రోజుల క్రితం కరోనా మహమ్మారి నివారణ కోసం మొదటి కోవిడ్ వ్యాక్సిన్ మోతాదును తీసుకున్నానని , అయినప్పటికీ తనకు కరోనా‘ పాజిటివ్ 'వచ్చిందని పేర్కొన్న నగ్మా అందుకే తాను హోం ఐసోలేషన్ లో ఉన్నానని చెప్పారు . దయచేసి జాగ్రత్త వహించండి అని చెప్తూనే, వ్యాక్సిన్ యొక్క 1 వ మోతాదు తీసుకున్న తర్వాత కూడా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా వచ్చే ప్రమాదం ఉంది . ఏమైనప్పటికీ #staysafe అంటూ నగ్మా ట్వీట్ చేశారు.

 ఏప్రిల్ 2న తన మొదటి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న నగ్మా

ఏప్రిల్ 2న తన మొదటి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న నగ్మా

ఏప్రిల్ 2 న నగ్మా తన మొదటి కోవిడ్ వ్యాక్సిన్ మోతాదును తీసుకున్నారు . మొదటి మోతాదు ఇచ్చిన తరువాత వెంటనే తనకు జ్వరం, దగ్గు , జలుబు వచ్చిందని పేర్కొన్నారు. మొదటి వ్యాక్సిన్ డోసు తీసుకున్న తర్వాత నగ్మా ట్వీట్ చేస్తూ, నిన్న ముంబైలో విపరీతమైన ఎండల సమయంలో కోవిడ్ నా మొదటి మోతాదు తీసుకున్నాను. తలనొప్పి ,జలుబు , దగ్గుతో బాధపడుతున్నాను. కళ్ళు బాగా మండుతున్నాయి అని, అయినప్పటికీ అంతా బాగానే ఉంటుందని ఆశిస్తున్నాను అన్నారు. ఇప్పుడు నగ్మాకు కరోనా పాజిటివ్ గా తేలింది .

Telangana : లిక్కర్ షాపులు, థియేటర్లపై ఆంక్షలు ఎందుకు లేవు - హైకోర్టు

 ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు కరోనా పాజిటివ్

ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు కరోనా పాజిటివ్

అంతకుముందు, ప్రముఖ నటుడు పరేష్ రావల్ కూడా టీకా యొక్క మొదటి డోసు తీసుకున్న తరువాత కరోనావైరస్ పాజిటివ్ బారిన పడ్డారు. ఇక వారు మాత్రమే కాదు అక్షయ్ కుమార్, గోవింద, విక్కీ కౌషల్, కత్రినా కైఫ్, అలియా భట్ సహా పలువురు ప్రముఖులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది . కరోనా వ్యాక్సిన్ డోస్ తీసుకుంటే, కరోనా సోకదు అనే భ్రమ నుండి బయటపడి వ్యాక్సిన్ డోసులు తీసుకున్నప్పటికీ కొద్దిరోజులపాటు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు వైద్య నిపుణులు.

Let's block ads! (Why?)