0, 23 March, 2015

వారఫలితాలు తేదీ మే 7 శుక్రవారం నుండి 13 గురువారం 2021 వరకు

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

ఈ వారం ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం, విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయ, కళారంగాలవారికి మరింత ప్రోత్సాహకరమైన కాలం. వారం ప్రారంభంలో అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా నిలిచి సత్తా చాటుకుంటారు. రావలసిన బాకీలు అందుతాయి. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో ముందడుగు వేసి పెట్టుబడులు సమకూర్చుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

ఈ వారం భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, నూతన వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు లభించే సూచనలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి. వారం ప్రారంభంలో ఆస్తుల వివాదాలు. ఆరోగ్యసమస్యలు. అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

ఈ వారం ఉద్యోగాలలో బాధ్యతలు కొంత తగ్గే అవకాశం. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. బంధువులతో విభేదాలు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. వస్తు, వస్త్రలాభాలు. కొన్ని సమస్యల నుంచ గట్టెక్కుతారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. కొత్త భాగస్వాములతో ఒప్పందాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

ఈ వారం ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయ, కళారంగాల వారికి అనుకూల సమయం. కుటుంబసమస్యలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. కొన్ని ఇబ్బందులు ఎదురైనా నేర్పుగా అధిగమిస్తారు. నిరుద్యోగుల శ్రమకు ఫలితం దక్కుతుంది. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-

ఈ వారం వ్యాపారాలు పుంజుకుంటాయి, పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమిస్తారు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు అనుకోని అవకాశాలు, విశేష గుర్తింపు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. మిత్రులతో కలహాలు. పనులు సకాలంలో పూర్తయి ఊపిరిపీల్చుకుంటారు. శ్రమ ఫలించే సమయం. ఆదాయం కొంత పెరుగుతుంది. సన్నిహితులతో కొన్ని వ్యవహారాల్లో అంగీకారానికి వస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే వీలుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగాన్వేషణ ఫలిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఈ వారం వ్యాపారాలలో లాభాలు అనుకున్న విధంగా దక్కుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా అవలీలగా పూర్తి చేస్తారు. రాజకీయ, కళారంగాల వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కవచ్చు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఉత్తేజాన్నిస్తాయి. పోటీపరీçక్షల్లో అనుకూల ఫలితాలు. చిరకాల మిత్రులు తారసపడి పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

ఈ వారం ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. రాజకీయవర్గాలకు పరిస్థితులు చక్కబడి ఉత్సాహంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు కొంత ఆశాజకనంగా ఉంటాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడి ఊపిరిపీల్చుకుంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఒక వివాదం నుండి నేర్పుగా బయటపడతారు. ఒక ప్రకటన విద్యార్థుల్లో ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. భాగస్వాములతో వివాదాలు తీరతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

ఈ వారం వ్యాపారాలు సాదాసీదాగా కొనసాగుతాయి. లాభాల కోసం శ్రమించాల్సిన సమయం. ఉద్యోగాలలో మార్పులు జరిగే అవకాశం. విధుల్లో నిర్లక్ష్యం తగదు. కళాకారులకు అవకాశాలు కొన్ని తృటిలో చేజారవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. కొద్దిపాటి ధనలబ్ధి. కొన్ని పనులు కొంత నిదానంగా పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పర్చి రుణాలు చేయాల్సిన పరిస్థితి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులు, మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

ఈ వారం వివాహయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు మునుపటి కంటే లాభిస్తాయి, నూతన పెట్టుబడులకు అవకాశం. ఉద్యోగాలలో ఊహించని పోస్టులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు పదవులు వరిస్తాయి. వారం చివరిలో బంధువులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలలో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం చేకూరుతుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నేర్పుతో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలలో కదలికలు ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఈ వారం ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు మరింత సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు సమస్యల నుంచి విముక్తి పొందుతారు. వారం ప్రారంభంలో మిత్రులతో కలహాలు. అనుకోని ధనవ్యయం. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో ఊహించని రీతిలో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలు కాస్త తీరి ఊరట చెందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ఈ వారం ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనయోగం. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు తగినంత లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు. వారం మధ్యలో బంధువులతో తగాదాలు. ఖర్చులు పెరుగుతాయి. కొన్ని సమస్యలు, వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. మీలోని ప్రతిభ చాటుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. చిన్ననాటి మిత్రులతో కొన్ని వ్యవహారాలలో చర్చిస్తారు. కుటుంబసభ్యులతో మరింత ఉత్సాహవంతంగా గడుపుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

ఈ వారం ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో సోదరులతో వివాదాలు నెలకొంటాయి. ధనవ్యయం. అనారోగ్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పర్చినా అవసరాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పాతమిత్రులను కలుసుకుని మీ అభిప్రాయాలను పంచుకుంటారు. కొత్త కాంట్రాక్టులు ఊహించని విధంగా దక్కుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Adblock test (Why?)